భాషా ప్రేమికుల ఆత్మీయ సమ్మేళనం — BTSV ఉగాది సాహిత్యోత్సవం
తెలుగు సాహిత్యాభిమానుల కోసం స్థాపించబడిన బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక (BTSV) నిర్వహించిన తొలి ఉగాది సాహిత్యోత్సవం ఏప్రిల్ 4న ఎంతో ఆత్మీయంగా, కుటుంబ వేడుకలా జరిగింది.
బోస్టన్ తెలుగు సాహిత్య వ్యవస్థాపక బృందం — అధ్యక్షురాలు శ్రీమతి దీప్తి గోర, శ్రీ పాణిని జన్నాభట్ల, శ్రీమతి శ్రేష్ఠ జొన్నలగడ్డ, శ్రీ శరత్ మహావాది అద్భుత సమన్వయంతో మరియు గౌరవ సలహాదారు శ్రీ బదరీనాథ్ విస్సాప్రగడ అద్వితీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆహుతులని అక్షరాలతో అలరించింది.
బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన ఉగాది సాహిత్యోత్సవ కథలు, కవితలు, వ్యాసాల రచనల పోటీకి విశేష స్పందన లభించింది. వివిధ దేశాల నుంచి పాల్గొన్న ప్రతి రచయితకు మా కృతజ్ఞతలు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు.
"బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం" అధ్యక్షురాలు శ్రీమతి సుధ ముల్పూర్ మరియు "శ్రుతిలయలు" అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ గోమఠం గార్లు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి, బీ.టీ.ఎస్.వి నిర్వహించిన కథలు, కవితలు, వ్యాసాల పోటీలలో గెలుపొందిన విజేతలని సత్కరించారు.
వేదిక పై ఉగాది ప్రత్యేక సంచికని ఆవిష్కరించారు.
తదనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి పద్మజా బాల "బాల లహరి" పిల్లలు చక్కటి వినోదభరిత నాటకంతో అందరినీ కడుపుబ్బ నవ్వించగా, భరతనాట్యం-కూచిపూడి సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో శ్రీమతి జయంతి ఘట్రాజు మరియు శ్రీమతి కిరణ్మయి జన్నాభట్ల వారి శిష్య బృందంతో అందరినీ అలరించారు.
పోటీ విజేతలు
వ్యాసాలు
- గిరిధర్ పొట్టేపాళెం – కాలం కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న (ప్రశంసా పత్రం)
- ఋత్విక్ శర్మ – ఇండియా ప్రయాణం (ప్రశంసా పత్రం - పిల్లల విభాగం)
కథలు
- పద్మజా బాల – మేధా మాయా వాణాస్త్రం (విజేత)
- శ్రీనివాస్ బారు – ఛిద్రం వినా కుడ్యం (విజేత)
- కావ్య అక్కినేపల్లి – తృష్ణా తీరం (ప్రశంసా పత్రం)
కవితలు
- డా. మైలవరపు లలిత కుమారి – ఆహ్వానం పలుకుదాం (విజేత)
- శ్రీనివాస్ బారు – స్వస్వరూపం (రెండవ బహుమతి)
- మురళి మోహన్ పసుమర్తి – వలస పక్షులు (ప్రశంసా పత్రం)
ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడనికి ఎన్నో విధాలుగా సహాయపడిన వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు. ఉగాది ప్రత్యేక సంచిక కోసం ప్రత్యేకంగా కథలు, వ్యాసాలు, కవితలు, హైకులు వ్రాసి పంపిన ఎల్లలెరుగని తెలుగు రచయితలకి వేవేల వందనాలు.
నెలనెలా జరిగే కథా చర్చల్లో పాల్గొనండి. మీ భాగస్వామ్యమే మా ఇంధనం. మీ అభిప్రాయాలు, సూచనలు మాతో పంచుకోండి!